LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

March 2022
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
9th March 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

టీటీడీ చైర్మన్ గా శ్రీ వైవి సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం

1 min read

టీటీడీ చైర్మన్ గా  వైవి సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం …

అనంతపూర్ లైవ్ న్యూస్ . 11 ఆగస్టు 2021,తిరుమల

తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ గా శ్రీ వైవి సుబ్బారెడ్డి బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలో బంగారు వాకిలి వద్ద ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి శ్రీ సుబ్బారెడ్డి తో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకున్నారు.

రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి చైర్మన్ ను శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందించారు. పలువురు ప్రజాప్రతినిధులు చైర్మన్ ను అభినందించారు.

ఉప ముఖ్యమంత్రి శ్రీ కె నారాయణ స్వామి, మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శాసన సభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీ ఎ. శ్రీనివాసులు, శ్రీ పి.రవీంద్ర రెడ్డి, శ్రీ ప్రసాదరాజు, శ్రీ దొరబాబు, ఎంపి డాక్టర్ గురుమూర్తి, తిరుపతి కార్పొరేషన్ డిప్యూటి మేయర్ శ్రీ భూమన అభినయ్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి,
జెఈవో శ్రీమతి సదా భార్గవి, సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కోవిడ్ తో ఆగిన కార్యక్రమాలు కొనసాగిస్తాం : చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

గత పాలక మండలి అనేక బృహత్తర కార్యక్రమాల నిర్వహణకు ఆమోదం తెలిపినా కోవిడ్ వల్ల అవి ఆగిపోయాయన్నారు. రాబోయే రోజుల్లో వీటన్నిటినీ కొనసాగిస్తామని చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ఆలయం ఎదుట తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించడం కోసమే శ్రీ వేంకటేశ్వర స్వామి వారు మరోసారి తనకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. తనకు ఈ భాగ్యం కల్పించిన స్వామివారి తో పాటు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానన్నారు. దేశవ్యాప్తంగా సుమారు వంద ఆలయాల్లో ప్రారంభించిన గుడికో గోమాత కార్యక్రమం కొనసాగిస్తూ, దేశంలోని ముఖ్య ఆలయాలన్నింటిలో భక్తులు గోపూజ చేసుకునే ఏర్పాటు చేస్తామని శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు.

ప్రపంచ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని, కోవిడ్ నుంచి విముక్తి లభించేలా చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ గత రెండేళ్లుగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు కొవిడ్ పూర్తిగా పోయే వరకు కొనసాగిస్తామని చెప్పారు.

గో ఆధారిత ఎరువుల ద్వారానే పండించిన ఉత్పత్తులతో స్వామి వారికి నిత్య నైవేద్యం సమర్పించే కార్యక్రమం వంద రోజులకు పైగా కొనసాగుతోందన్నారు.శాశ్వతంగా ఈ కార్యక్రమం కొనసాగే ఏర్పాట్లు చేస్తామన్నారు. దేశ వ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. సామాన్య భక్తులకు సులభంగా, శ్రీఘ్రంగా స్వామి వారి దర్శనం కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. కోవిడ్ కారణంగా భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా నిలిపి వేసిన సర్వ దర్శనం 15 రోజుల్లోపు కొంత సంఖ్యలో నైనా పునరుద్దరించేందుకు గల అవకాశాలు పరిశీలించేందుకు అధికారులతో చర్చిస్తానని శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు.

ఎం.శ్రీధర్,
రిపోర్టర్,
అనంతపూర్ లైవ్ న్యూస్.
8247419105.

satta king hdhub4u