బాల్య వివాహాల కథనంపై అనంతపూర్ లైవ్ న్యూస్ కథనాలకు కదిలిన జిల్లా యంత్రాంగం.
1 min read
హిందూపురం.
ఆగస్టు: 19. హిందూపురం మండలం కగ్గల్లు పంచాయతీలోని సుబ్బిరెడ్డి పల్లి గ్రామం లో బాల్య వివాహాల కథనంపై గత మూడు నెలలుగా అనంతపూర్ లైవ్ న్యూస్ వెలుగు లోనికి తీసుకు రావడం జరిగినది. గతంలో రెండుసార్లు అధికారులు గ్రామాన్ని సందర్శించి బాల్య వివాహాల వలన జరిగే నష్టాల గురించి ప్రజలకు తెలియజేశారు. అయినప్పటికీ కొంతమంది బాల్యవివాహాలు చేసేశారు.
దీనిని తీవ్రంగా పరిగణలోనికి తీసుకున్నటువంటి చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా అధికారులు, ఈరోజు ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో గ్రామాన్ని సందర్శించారు. సాయంకాలం ఆరు గంటల వరకు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి విచారణ జరిపారు.
గతంలో జరిగినటువంటి పరిమళ, సోను ఇళ్ల వద్దకు వెళ్లి వారిని కూడా విచారించారు.అయినప్పటికీ వారు వాళ్ళ ఇంటిదగ్గర లేనందున వారి తల్లదండ్రులను విచారించి పరిమళ ను,సోను ను పిలుచుకురావల్సిందిగా ఆదేశించారు.సాయంకాలం ఆరు గంటల వరకూ అధికారులు వేచియుండగా ఎంతసేపటికీ రాకపోయినందున అధికారులు వారి అసహనాన్ని వ్యక్తపరిచారు.అధికారులు వచ్చారు అని తెలిసి కూడా రాకపోవడం పై చట్టం పై వారికి ఎంత అవగాహన ఉందో అర్థమవుతోంది.
సోను భర్త జగదీష్ ను ఫోన్ లో అధికారులు సంప్రదించగా పనిఉంది ఇపుడు రాలేను అని నిర్లక్ష్య ధోరణి తో సమాధానం చెప్పడం గమనార్హం.
ఇక స్వాతంత్ర్య దినోత్సవం సాక్షిగా వివాహం చేసుకున్న గంగోత్రి ఇంటికి వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉండడం వలన వెనుదిరిగారు. సాయంకాలం ఆరు గంటల వరకూ అధికారులు వేచియుండగా రాకపోవడం తో ఖచ్చితంగా వివాహాలు చేసుకున్నారు గనుక రావడానికి భయపడి రావడం లేదు అని నిర్ధారణకు వచ్చారు.అందుకు అధికారులు తాలూకా పోలీస్ స్టేషన్ నందు కేసు పెట్టి అక్కడికి పిలిపించుకోవాలని వెళ్ళిపోయారు.చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బాధితులు రాజకీయ ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని లోలోపలే కేసును నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారని కొందరు ప్రజలు అనుమానాన్ని వ్యక్తపరిచారు.
చట్టం తన పని తాను చేసుకుపోతుందో లేక ఒత్తిళ్లకు గురవుతుందో వేచి చూద్దాం.
గంగోత్రి వాళ్ళు వారి తల్లిదండ్రులు ఆదివారం నుండి కర్ణాటక లోని ఒక కుగ్రామం లో తలదాచుకున్నారు అని సమాచారం.
ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా అధికారులు నవీన్, చంద్రమోహన్, ఐ సి డి ఎస్. సి డి పి ఓ నాగమల్లేశ్వరి, సూపర్వైజర్ లలిత, అంగన్వాడీ కార్యకర్త ఉమాదేవి, సచివాలయం మహిళా పోలీస్ దివ్యారెడ్డి, వాలంటీర్లు అనిత, సువర్ణ, ఆశ వర్కర్ సరస్వతి, పోలీస్ కానిస్టేబుల్ సుధాకర్, గ్రామంలోని నాయకుడు మల్లికార్జున పాల్గొన్నారు.

సుధీర్ కుమార్,
రిపోర్టర్,
అనంతపూర్ లైవ్ న్యూస్,
హిందూపురం.
7386799001.