LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

January 2022
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
19th January 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

రైతాంగాన్ని ఆదుకోవాలి

1 min read

 

ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి

అనంతపురం :

అనంతపురం జిల్లాలో రైతాంగాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి కోరారు.శనివారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో జిల్లాలో ఇటీవల సంభవించిన వరదలు, భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాలపై జిల్లా అధికారులతో జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు.కార్యక్రమంలో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, రెండు లక్షల ఎకరాల్లో పప్పు శనగ పంటకు నష్టం వాటిల్లిందన్నారు.ఖరీఫ్లో వేరుశెనగ పంట వేసి పంటకోత తర్వాత నష్టపోయిన వారిని కూడా నష్టపరిహారం అందించేందుకు పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఎక్కడ నుంచి నీరు వస్తాయి, ఏ ఏ చెరువులు పూర్తిగా నిండిఉన్నాయి,ఏ ఏ చెరువులకు గండిపడే అవకాశంఉందో వాటిని సంబంధిత అధికారులు వెంటనే గుర్తించి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రైతులు ఇన్పుట్ సబ్సిడీ కావాలని అడుగుతున్నారన్నారు.