LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

July 2022
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
2nd July 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా

1 min read

సిఐటియు ఆధ్వర్యంలో పరిశ్రమల లో పనిచేస్తున్న-కార్మికుల జీవితాలను బలిగోంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక విధానాలను మార్చాలని

కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా

కార్మికుల సంక్షేమం పట్టదా?

కార్పొరేట్ల కోసమేనా కార్మిక చట్టాల సవరణ !

సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ నాగేంద్ర కుమార్

డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి గాయత్రి దేవి గారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ నాగేంద్రకుమార్ మాట్లాడుతూ
గత నాలుగు సంవత్సరాల క్రితం మన జిల్లా తాడిపత్రి లో 2018 జూలై లో GERDAU స్టీల్ ప్లాంట్ లో గ్యాస్ లీక్ వలన ఆరు మంది చనిపోయినారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో చాల జిల్లాల లో అనేక పరిశ్రమలలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అన్నారు.ఈ సంఘటనల వలన రాష్ట్రవ్యాప్తంగా 88 మంది చనిపోవడం జరిగింది. నేటి వరకు నష్టపరిహారం వారి సామాజిక భద్రత గురించి ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరిస్థితుల వలన కార్మికులకు రాష్ట్రంలో భద్రత లేదు. దానికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక భద్రతా విధానాల్లో తెచ్చిన మార్పులే కారణం.(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)పేరు తో కార్మిక చట్టాలు మార్చేస్తున్నారు. ఈ మార్పులు యజమానులకు అనుకూలంగా ఫ్యాక్టరీలను తనిఖీ చేయకుండా అధికారుల పై ఆంక్షలు విధించాయి.ఈ విధానాలు కార్మికుల ప్రాణాలకు భద్రత లేకుండా చేస్తున్నాయి.ఈ విధానం 2001 నుంచి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ విధానాన్ని కొనసాగుతోంది. ఈ కారణం గా పారిశ్రామిక ప్రమాదాల సంఖ్య రోజు రోజు కు పెరుగుతుంది.
2016 నుంచి కేంద్ర ప్రభుత్వం కంప్యూటర్ ఆధారిత తనిఖీ లను ప్రవేశపెట్టాలని రాష్ట్రలను ఆదేశించారు. వెంటనే నాటి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేసేందుకు జీఓ నెంబర్ 27 జారీ చేసింది.ఈ విధానం వల్ల తనిఖీ అధికారులు ముందుగా యజమానులకు తేలియజేసిన తర్వాత నే ఫ్యాక్టరీ లను తనిఖీ చేయాలి.తనిఖీ తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాల వరకు తనిఖీ కి వెల్ల కూడదు. తనిఖీ ల శాఖలను ప్రభుత్వాలు నిర్వీర్యం చేయడం వల్లనే కార్మికులు ప్రమాదాల్లో అన్యాయంగా ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు అనాధులుగా మారుతున్నారు.
పోలీసుశాఖ ప్రమాదాలకు కారకులైన పారిశ్రామిక యజమానుల పై కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలి.కానీ మన రాష్ట్రంలో జిల్లాలో పోలీసు శాఖ యజమానుల చుట్టంగా వ్యవహరిస్తోంది. ఐఏఎస్, ఐపిఎస్, అధికారులు చట్టాలను తమ బాధ్యతగా అమలు చేయడాన్ని మరచిపోయారు.అందువల్ల కార్మికులకు ఈ పరిస్థితి ఏర్పడింది.
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది.పాత కార్మిక చట్టాల వల్ల కార్మికులకు అంతో ఇంతో ఉపయోగపడేవి.ఇప్పుడు ఈ లేబర్ కోడ్లతో కార్మికులకు ఉద్యోగ భద్రత, వేతన భద్రత, ప్రాణాలకు భద్రత, లేకుండా పోతున్నాయి.అందుకే పారిశ్రామిక రక్షణ చర్యలు ప్రభుత్వాలు తీసుకుని కార్మికులకు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.ఈ మెమోరాండం అనంతపురం జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వనికి పంపమని కోరుతుంది.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పేజీ రాజమోహన్ శ్రీనివాస రావు ,నాగభూషణం గుర్రాజు చంద్రశేఖర్ సురేంద్ర శ్రీనివాసులు ఎర్రి స్వామి బాలకృష్ణ వీరితో పాటు వివిధ రంగాల కార్మిక నాయకులు పాల్గొని పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు  MALL