*జనవరి 30, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె* UFBU.
1 min read*జనవరి 30, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె*
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) – తొమ్మిది యూనియన్ల గొడుగు సంస్థ, జనవరి 30 మరియు 31 తేదీలలో భారతదేశం అంతటా రెండు రోజుల బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చింది. UFBU పిలుపు మేరకు హైదరాబాద్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులు బ్యాడ్జీలు ధరించి బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రాంతీయ కార్యాలయం (తెలంగాణ సౌత్) వద్ద ఈరోజు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా BOBEU (AIBEA) తెలంగాణకు చెందిన నాయకులు అసిస్టెంట్ రీజినల్ సెక్రెటరీ శ్రీనివాస రావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ శివ కుమార్, AIBOA నాయకులు శ్రీకాంత్ పాల్, కిరణ్ కుమార్, AIBOC నాయకురాలు శృంఖలా జోషి మాట్లాడుతూ.. వారంలో ఐదు రోజులు బ్యాంకింగ్ సేవలు అందించాలని, గతంలో పదవీ విరమణ చేసిన వారికి పింఛన్ అప్‌డేట్ చేయాలని, అన్ని కేడర్లలో సరిపడా రిక్రూట్‌మెంట్ కల్పించాలని, మెరుగైన సేవలందించాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 12వ ద్వైపాక్షిక వేతన సవరణ యొక్క డిమాండ్ల చార్టర్ పై చర్చలను వెంటనే ప్రారంభించాలని బ్యాంకు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. కావున బ్యాంకు ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఈ రెండు రోజుల బ్యాంకు సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని మరియు ఖాతాదారులు కూడా ఈ బ్యాంకు సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు.