రౌడీషీటర్ హత్య కేసులో నలుగురి అరెస్టు
1 min readహత్య జరిగిన మూడ్రోజుల్లోనే కేసు ఛేదించిన అనంతపురం ఒన్ టౌన్ పోలీసులు
అనంతపురంలో ఈనెల 1 న జరిగిన రౌడీషీటర్ హత్య కేసులో నలుగురి నిందితులను ఒన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు పాత నిందితులు. హతుడు, నిందితులందరూ మంచి స్నేహితులు. మద్యం మత్తులో తలెత్తిన చిన్నపాటి గొడవతో ఈ హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హత్య జరిగిన మూడ్రోజుల్లోనే కేసు ఛేదించిన అనంతపురం ఒన్ టౌన్ పోలీసులను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు అభినందించారు.
** అరెస్టయిన నిందితుల పేర్లు :
1) పఠాన్ షెక్షావలి @ బ్రూస్లీ, శ్రీకృష్ణదేవరాయ నగర్, బుక్కరాయ సముద్రము మండలము అనంతపురము జిల్లా.
2) సయ్యద్ జిలాన్, లింగమయ్య కొట్టాలు, అనంతపురము.
3) అడపాల చంద్ర శేఖర్, భవాని నగర్, అనంతపురము.
4) షేక్ అన్సార్ బాషా, లింగమయ్య కొట్టాలు, అనంతపురము.
** నేపథ్యం: అనంతపురంలోని రాజమ్మ కాలనీకి చెందిన సికిందర్ ఈనెల 1 వ తేదీన స్థానిక గుత్తి రోడ్, భాగ్య లక్ష్మి రైస్ సమీపంలో హత్యకు గురయ్యాడు. ప్రస్తుతం అరెస్టయిన నలుగురు నిందితులు, హతుడుకు మంచి స్నేహితులు.
వీరంతా ఫుల్ గా మద్యం సేవించి మద్యం మత్తులో చిన్న కారణంతో గొడవపడి నలుగురు కలసి సికిందర్ పై బండరాయితో మోది హత్య చేశారు.
అనంతపురం ఒన్ టౌన్ ఇన్స్పెక్టర్ R ప్రతాప్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి మూడ్రోజుల్లో ఛేదించారు. స్థానిక భవాని నగర్ క్రాస్ రోడ్ వద్దఈ నలుగురు నిందితులను సి.ఐ ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. అరెస్టయిన నలుగురు నిందితుల్లో పఠాన్ షెక్షావలి @ బ్రూస్లీపై 2 హత్య కేసులు… అడపాల చంద్ర శేఖర్ పై దొంగతనం కేసులు ఉన్నాయి.