తెలంగాణ వీరనారి, సాయుధ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
1 min readతెలంగాణ వీరనారి, సాయుధ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందుకు సీఎం శ్రీ కేసిఆర్ కు ఐలమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మేరకు, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్వర్యంలో ఐలమ్మ వారసులు పాలకుర్తి మాజీ సర్పంచ్ శ్రీ చిట్యాల రామచంద్రం, వారి కొడుకు శ్రీ చిట్యాల సంపత్, కుటుంబ సభ్యులు ఇవాళ ప్రగతి భవన్ లో సీఎంను కలిశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ శ్రీనివాస్ గౌడ్, శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర ఛైర్మన్ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.