సిరి ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో అవసరం,ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, డా. ఖాదర్ వళి
1 min readఅనంతపురం, నవంబర్ 14;
సిరి ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో అవసరం అని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని లలితకళాపరిషత్ లో డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించిన “సిరి ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం” కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు,ఎంపీ రంగయ్య గారు, డా. ఖాదర్ వళి,మేయర్ వసీం,డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య,ఆర్టీసీ రీజనల్ చైర్పర్సన్ మంజులా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు మాట్లాడుతూ అంతరించిపోతున్న సిరిధాన్యాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి ఖాదర్ వలి గారు చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు.
ముఖ్యంగా వ్యవసాయ రంగం పై ఆధారపడిన అనంతపురం జిల్లా రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావాలంటే రైతులు పండించిన పంటకు డిమాండ్ వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందన్నారు.చిరుధాన్యాల వాడకం పెరిగితే వాటిని పండించే రైతులు పెరిగే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సైతం జిల్లాలో మిల్లెట్ రంగం అభిరుద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన నిర్వాహకులను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు అభినందించారు.