అనంతపురంలో రెండు సంవత్సరాలుగా వింత జీవితం గడుపుతున్న ఓ కుటుంబంలో పోలీసుల మానవత్వం వెలుగులు నింపింది
1 min readఅనంతపురంలో రెండు సంవత్సరాలుగా వింత జీవితం గడుపుతున్న ఓ కుటుంబంలో పోలీసుల మానవత్వం వెలుగులు నింపింది
* అమ్మ, నాన్న చనిపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లి ఇంటికే పరిమితమైన ముగ్గురు కుటుంబ సభ్యులకు విముక్తి కల్పించారు
* బూజు పట్టిన ఇల్లు .. జడలు కట్టిన జుట్టుతో దుర్గంధం వెదజల్లుతూ శ్మశాన వాటికను తలపిస్తోన్న వాతావరణం నుండీ జన జీవనంలోకి తెచ్చిన అనంతపురం పోలీసులు
** వివరాలు…
అనంతపురం నగరం వేణుగోపాల్ నగర్ ఆటో స్టాండ్ సమీపాన ఉన్న ఓ ఇంట్లో ముగ్గురు సభ్యులున్న కుటుంబం గత రెండేళ్లుగా బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఇంట్లోనే మగ్గుతున్నారు. వీరి తండ్రి మూడేళ్ల కిందట చనిపోవడంతో ఈ ముగ్గురూ డిప్రెషన్ లోకి వెళ్లారు. అప్పటి నుండీ ఆ ఇళ్లు తలుపులు వేసినవి వేసినట్లే ఉంటున్నాయి. బిల్లు చెల్లించక పోవడంతో కరెంటు సైతం కట్ చేశారు. అవేమీ పట్టించుకోకుండా అంధకారంలోనే జీవిస్తున్నారు. జుట్టు పెరిగి జడలుగా అట్టకట్టాయి. గోర్లు విపరీతంగా పెరిగాయి. స్నానం లేదు. ఇళ్లంతా దుర్గంధం. లోపల శ్మశాన వాతావరణం తలపిస్తోంది ఈక్రమంలో విపరీతమైన దుర్గంధం బయటికి వెదజల్లడంతో స్థానికులు గమనించారు. ఈవిషయం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి దృష్టికి వచ్చింది. అనంతపురం ఇన్ఛార్జి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రవి శంకర్ రెడ్డి, సిబ్బంది, మరియు స్థానిక కార్పొరేటర్ సుజాత, స్థానికులు సంయుక్తంగా ఆ ఇంటిని ఈరోజు సందర్శించారు. ఇరుగు పొరుగు వారి సహాయముతో మానసిక ఒత్తిడిలో ఉన్న వారికి కౌన్సిలింగ్ చేశారు. తరువాత వారిని ఒప్పించి వారికి స్నానాలు చేయించారు. కొత్త దుస్తులు మరియు నిత్యావసర వస్తువులను ఇప్పించి వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చారు. పోలీసుల మానవత్వం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.