కోవిడ్ -19ను ఎదుర్కొనేందుకు , ఆర్‌సిఎఫ్ కొత్త ఉత్పత్తి తయారు: చేతులను శుభ్రపరిచే ఐసో ప్రొపైల్ ఆల్కహాల్ (ఐసిఎ) ఆధారిత జెల్
1 min readకోవిడ్ -19 ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తనవంతు స్వల్ప పాత్రగా, భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ కిందగల ప్రభుత్వరంగ సంస్థ, రాష్ట్రీయ కెమికల్సు అండ్ ఫర్టిలైజర్ స్ లిమిటెడ్ (ఆర్.సి.ఎఫ్) చేతులను శుభ్రపరిచే ఐపిఎ జెల్- ”ఆర్‌సిఎఫ్ సేఫ్‌రొలా”ను ప్రవేశపెట్టింది.
ఆర్‌సిఎఫ్ కథనం ప్రకారం, ఈ చేతులను శుభ్రపరిచే జెల్ చర్మానికి అనుకూలమైన తేమ ఆధారిత హ్యాండ్ శానిటైజర్. ఇందులో ఐసో ప్రొపైల్ ఆల్కహాల్(ఐపిఎ), అలొవేరా నుంచి తీసిన పదార్థం ఉంటుంది.దీనిని విటమిన్ -ఇ తో సమృద్ధం చేయడంతోపాటు దీనికి తాజా నిమ్మ సువాసన వచ్చేలా చేశారు.
చేతిని శుభ్రపరిచే ఈ జెల్‌ను ఆర్‌సిఎప్ 50మిల్లీలీటర్ల, 100 మిల్లీలీటర్ల పరిమాణంలో వరుసగా రూ 25, రూ50 ల ధరతో అందుబాటులోకి తెచ్చింది.ఈ జెల్‌కు కంపెనీ నిర్ణయించిన గరిష్ఠ చిల్లర ధర ఇది. ఆర్‌సిఎఫ్ దీనిని దేశవ్యాప్తంగా తనకు గల పంపిణీ నెట్‌వర్కు ద్వారా మార్కెట్ చేయాలని ప్రతిపాదించింది.
ప్రస్తుత కోవిడ్ -19 మహమ్మారి కారణంగా చేతిని శుభ్రపరిచే ఉత్పత్తులకు మార్కెట్‌లో ఉన్న మంచి డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ఆర్‌సిఎఫ్, సురక్షితమైన, సహేతుక ధరలో ఈ జెల్‌ను ఉత్పత్తి చేసింది. కోవిడ్ మహమ్మారి కట్టడిలో తన వంతు స్వల్ప పాత్రగా ఆర్‌సిఎఫ్ దీనిని ఉత్పత్తి చేసింది.
ఆర్‌సిఎఫ్ సిఎండి శ్రీ ఎస్.సి. ముద్గేరికర్ ఈ విషయమై స్పందిస్తూ,ఆర్‌సిఎఫ్ హ్యాండ్ క్లీనింగ్ ఐపిఎ జెల్- ఆర్‌సిఎఫ్ సేఫ్‌రోలా పేరుతో కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టడం తమకు సంతోషం కలిగిస్తోందన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ఆర్‌సిఎఫ్ తనవంతు స్వల్ప పాత్రగా ఈ ఉత్పత్తిని తీసుకువచ్చినట్టు ఆయన చెప్పారు.
ఆర్‌సిఎఫ్ సంస్థ మినీ రత్న కంపెనీ. ఇది దేశంలోని ఎరువులు, రసాయనాల ఉత్పత్తి రంగంలో ప్రముఖ కంపెనీ. ఇది యూరియా, మిశ్రమ ఎరువులు, బయోఫర్టిలైజర్లు, సూక్ష్మ పోషకాలు, నీటిలో కరిగే ఎరువులు, సాయిల్ కండిషనర్లు, ఇంకా ఎన్నో రకాల పారిశ్రామిక రసాయనాలను తయారు చేస్తుంది. గ్రామీణ భారతదేశంలో ఇది ఇంటింటా ఎంతో ప్రాచుర్యం కలిగినది. ఈ సంస్థకు చెందిన ఉజ్వల (యూరియా), సుఫల (కాంప్లెక్స్ ఎరువులు) అత్యధిక బ్రాండ్ విలువను కలిగి ఉన్నాయి. ఎరువుల ఉత్పత్తులకు తోడు, ఆర్.సి.ఎఫ్ అద్దకం, సాల్వెంట్లు, లెదర్, ఫార్మాసూటికల్ తదితర రంగాలకు ఉపయోగపడే పారిశ్రామిక రసాయనాలను పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేస్తుంది.
***