*ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ని ఘనంగా సన్మానించిన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవెలప్ మెంట్ సొసైటీ**(APJDS)*
1 min read{అనంతపురం లైవ్ న్యూస్}
*APJDS రాష్ట్ర అధ్యక్షుడు *మచ్ఛా రామలింగా రెడ్డి* ఆదేశాల మేరకు అనంతపురం పర్యటన కు విచ్చేసిన *ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి* ని ఏపీజేడీఎస్ నగర కమిటీ అనంతపురం పట్టణం లోని ప్రెస్ క్లబ్ నందు గజ మాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ మాట్లాడుతూ జర్నలిస్ట్ ల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని అర్హత ఉన్న ప్రతి జర్నలిస్ట్ కు అక్రిడి టేషన్ ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీజేడీఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెంకటేష్ , ఏపీజేడీఎస్ నగర కమిటీ అధ్యక్షుడు శ్రావణ్ , సెక్రెటరీ బాలు , ట్రెజరరీ సాకే జానీ , చిన్న పత్రికలు అధ్యక్షుడు షాకిర్ అనంతపురం లైవ్ న్యూస్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.