హిందూపురం రూరల్ న్యూస్ పోలీసుల నిస్వార్ధమైన పని తీరు
1 min readఆనంతపూర్ లైవ్ న్యూస్ : ఆగస్టు11 హిందూపురం రూరల్ న్యూస్ పోలీసుల నిస్వార్ధమైన పని తీరు ఫోన్ పే ద్వారా ఒక నంబరుకు బదులు మరో నంబరుకు నగదు బదిలీ, బాధితుడు పిర్యాదు మేరకు సోమందేపల్లీ పోలీసులు స్పందనతో తిరిగి బాధితుడు అకౌంట్ లోకి చేరిన పోయిన మొత్తం నగదు.
వివరాలలోకి వెళితే, బ్రాహ్మణ పల్లి కి చెందిన సైఫుల్ల స్టీల్ పాత్రలు అమ్ముకొని జీవనం చేస్తున్నాడు. సరుకు బెంగళూరు నుండి ఒక వ్యాపారి దగ్గర నుండి తెచ్చుకుంటూ వారికి తన వ్యాపారం అయిపోయాక వచ్చిన డబ్బులు తిరిగి చెల్లించేవాడు. 4 రోజుల క్రిందట సైఫుళ్ళ తన సరుకు ఊరూ ఊరూ తిరిగి అమ్ముకొని వచ్చిన డబ్బులు తనకి సరుకు ఇచ్చిన వ్యాపారికి ఫోన్ పే లో చెల్లించాడు, మొత్తం 49,000 రూపాయలు. అయితే బెంగళూరు వ్యాపారి తనకి డబ్బులు చేరలేదని ఫోన్ చేసి అడుడగ వెంటనే సైఫుల్లా ఫోన్ పే చేసిన మొబైల్ స్క్రీన్ షాట్ తీసి పంపించగా అందులో వ్యాపారి నెంబరు బదులు ఒక అంకె తేడాతో మరో నెంబరు కి 49,000 రూపాయలు వెళ్లిపోయాయి. పొరపాటు గ్రహించిన బాధితుడు వెంటనే సోమందేపల్లి పోలిసులకు జరిగింది చెప్పగా, పొరపాటుగా చేరిన నెంబరు కి ఫోన్ చేసి అడుగగా అతను నాకీ ఏమి తెలియదు అని మొదట మొబైల్ ఆఫ్ చేసేసుకున్నాడు. అయినా అతని అకౌంట్ అడ్రస్ చూసి తూర్పు గోదావరి జిల్లా పోలీసుల కు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించిన తూర్పు గోదావరి పోలీసులు సదరు వ్యక్తి అడ్రస్ దగ్గరికి వెళ్లి విచారణ చేయగా తన అకౌంట్ ఫోన్ పే లోకి డబ్బులు పడినది వాస్తవం అని ఒప్పుకున్నారు. ఇతరుల డబ్బు తనకి వద్దు అని పోలీసుల సూచన మేరకు ఎవరి ఫోన్ పే ద్వారా 49,000 రూపాయలు తన అకౌంట్ లోకి వచ్చాయో తిరిగి అతను అదే ఫోన్ పే లోకి మొత్తం అమ్మౌంట్ పంపించడం జరిగింది. తిరిగి తన అమ్మౌట్ 49,000 రూపాయలు సై ఫుల్ల అకౌంట్ లోకి రావడం తో తనకి పోలీస్ లు స్పందించి తన నగదు తిరిగి వచ్చేలా చేసినoదుకు పోలిసులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. అలాగే బాధితుడు తూర్పు గోదావరి పోలీసులకు కూడా కృతజ్ఞతలు తెలియజేశాడు. బ్రాహ్మణ పల్లి సర్పంచ్ జిలాన్ ఖాన్ స్టేషన్ కి, పేద వారికి వెంటనే స్పందించి సహాయం చేసినందుకు ధన్యవాదాలుతెలిపారు. .
హిందూపురం లైవ్ న్యూస్ రిపోర్టర్ టి. ప్రేమ్ కుమార్