రామాయపట్నం : కోవిడ్ నేపథ్యంలో ఇటీవల నిలిపివేసిన రామాయపట్నం లైట్ హౌస్ సందర్శనను పునఃప్రారంభించినట్లు లైట్ హౌస్ ఇంచార్జి శ్రీ కె.వేణు గోపాల్
1 min read
రామాయపట్నం : కోవిడ్ నేపథ్యంలో ఇటీవల నిలిపివేసిన రామాయపట్నం లైట్ హౌస్ సందర్శనను పునఃప్రారంభించినట్లు లైట్ హౌస్ ఇంచార్జి శ్రీ కె.వేణు గోపాల్ గారు మంగళవారం ఒక ప్రకనలో తెలిపారు.దీనికోసం పెద్దలకు రూ.10 ,చిన్న పిల్లలకు రూ.3 నామమాత్రపు రుసుము వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు.మధ్యాహ్నం 03 గంటల నుండి 05 గంటలకు మాత్రమే సందర్శనకు అవకాశం ఉందని వివరించారు.75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ఆజాదీకా మహోత్సవ్ నేపద్యంలో ఆగస్ట్ 10 నుండి 15 వ తేదీ వరకు 10 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా సందర్శించే అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించారు.ఆగస్ట్ 15 వ తేదీన మాత్రం ప్రజలందరికీ ఉచితంగా సందర్శించే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు.కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నారు.