‘Agnipath Scheme’ ప్రకటించిన నేపథ్యంలో, అందులో నియాకమై నాలుగేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న అగ్నివీరులను సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో నియమించుకోవాలని
1 min readప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘అగ్నిపథ్ స్కీమ్’ను ప్రకటించిన నేపథ్యంలో, సీఏపీఎఫ్‌లు, అస్సాం రైఫిల్స్‌లో నియామకం కోసం ఈ పథకం కింద నాలుగేళ్లు పూర్తి చేసుకున్న అగ్నివీర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నేడు నిర్ణయించింది.
యువత ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న దార్శనికతతో కూడిన, స్వాగతించే నిర్ణయమే ‘అగ్నిపథ్ యోజన’ అని కేంద్ర హోంమంత్రి కార్యాలయం ట్వీట్‌లో ద్వారా పేర్కొంది. సీఏపీఎఫ్‌లు, అస్సాం రైఫిల్స్‌లో నియామకం కోసం ఈ పథకం కింద నాలుగు సంవత్సరాలు పూర్తి చేసిన అగ్నివీర్లుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ‘అగ్నిపథ్ యోజన’ కింద శిక్షణ పొందిన యువత దేశ సేవకు, భద్రతకు దోహదపడతారని కేంద్ర హోం మంత్రి కార్యాలయం పేర్కొంది. నేటి నిర్ణయం ఆధారంగా ఒక వివరణాత్మక ప్రణాళికను సిద్ధం చేయడం ప్రారంభించబడింది.