*జర్నలిస్టులకు పోలీస్ శాఖ అండగా ఉంటుంది* *ఎం.రవి ప్రకాష్ డీఐజీ అనంతపురం రేంజ్*
1 min read*జర్నలిస్టులకు పోలీస్ శాఖ అండగా ఉంటుంది*
*క్రికెట్ అకాడమీను ఉపయోగించుకోవాలి*
*మచ్చా రామలింగారెడ్డి కృషి అభినందనీయం*
*జర్నలిస్టులు సమాజసేవకులు*
*కొడిమి జర్నలిస్ట్ కాలనీ అద్భుతంగా ఉంది*
*ఎం.రవి ప్రకాష్ డీఐజీ అనంతపురం రేంజ్*
*ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన రవి ప్రకాష్ డీఐజీ అనంతపురం రేంజ్*
==================
👉జర్నలిస్టులు సమాజ సేవకులు నిత్యం ప్రజలు చైతన్యవంతులు కావడానికి మీడియా రంగం ఎంతగానో కృషి చేస్తుందని పోలీస్ శాఖ జర్నలిస్టులకు అన్నివిధాలుగా అండగా ఉంటుందని ఎం.రవి ప్రకాష్ డీఐజీ అనంతపురం రేంజ్ అన్నారు
👉ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కొడిమి జర్నలిస్ట్ కాలనీ నందు ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటు చేసిన క్రికెట్ అకాడమీ నెట్స్ ను బుధవారం ఉదయం జర్నలిస్ట్ కాలనీలో క్రికెట్ అకాడమీ ఓపెన్ జిమ్ ప్రారంభ కార్యక్రమం జరిగింది.
👉ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎం.రవి ప్రకాష్ డిఐజి అనంతపురం రేంజ్ ఆత్మీయ అతిథులుగా వీవీఎస్ మూర్తి ఆర్ డి మున్సిపల్ శాఖ, మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ APWJU, లక్ష్మీకాంత్ రెడ్డి TV9, బ్యూరో ఇంచార్జ్, సొసైటీ ప్రధాన కార్యదర్శి విజయరాజు, రూరల్ CI మురళీధర్ రెడ్డి, కొడిమి సర్పంచ్ సుబ్బిరెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.
👉కొడిమి జర్నలిస్ట్ కాలనీ చాలా అద్భుతంగా ఉందని నేను రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పని చేశానని ఎక్కడ ఇటువంటి జర్నలిస్ట్ కాలనీ చూడలేదని ఇది రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని డీఐజీ రవి ప్రకాష్ ఆకాంక్షించారు
👉మచ్చా రామలింగారెడ్డి ఈ కాలనీ ఏర్పాటు కు 20 ఏళ్లుగా చేసిన పోరాటం మీ అందరికీ తెలుసునని, కాలనీ ఏర్పాటు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం కోసం కృషి చేశారని గుర్తు చేస్తూ ఇది అంత చిన్న విషయం కాదని ఇన్ని సంవత్సరాలు ఉద్యమంలో ఉండటం ఒక గొప్ప విషయమని ఆయనను అభినందిస్తున్నానని రవి ప్రకాష్ డిఐజి అన్నారు.
👉జర్నలిస్టులు అందరూ ఐకమత్యంగా ఈ కాలనీలో అందరూ ఇల్లు నిర్మించుకోవాలని రాబోయే రోజుల్లో ఈ కాలనీ మరింత అభివృద్ధి చెందాలని అందుకు పోలీస్ శాఖ తరపున ఎటువంటి సహకారం అయిన ఎల్లప్పుడూ ఉంటుందని రవి ప్రకాష్ డి ఐ జి జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. జర్నలిస్ట్ కాలనీలో నిత్యం రాత్రిపూట పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు.
👉క్రికెట్ అకాడమీ జర్నలిస్టు పిల్లలతోపాటు అందరూ ఉపయోగించుకోవాలని మంచి క్రీడాకారులుగా తయారు కావాలని జాతీయ స్థాయి క్రికెట్ కు ఎంపిక కావాలని డీఐజీ రవి ప్రకాష్ ఆకాంక్షించారు
👉వీవీఎస్ మూర్తి మాట్లాడుతూ జర్నలిస్టులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని ఈ రోజు క్రికెట్ అకాడమీ ఏర్పాటు కావడం అభినందనీయమని అన్నారు జర్నలిస్టులకు ఒక క్రికెట్ అకాడమీ ఉండడం వారి పిల్లల భవిష్యత్తు కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మూర్తి అన్నారు.
👉మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఇప్పుడు కాలనీలో స్పోర్ట్స్ సెంటర్ ని ఏర్పాటు చేసుకోగలిగారు, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేసి రాష్ట్రానికి కొడిమి జర్నలిస్ట్ కాలనీ ఒక రోల్ మోడల్ గా ఉండే విధంగా పనిచేస్తామని రామలింగారెడ్డి అన్నారు.
👉సభ అనంతరం ఎం. రవి ప్రకాష్ డి ఐ జి కాలనీ లో నూతన క్రికెట్ అకాడమీ క్రికెట్ నెట్స్ ను మూర్తి, మచ్చా రామలింగారెడ్డితో కలిసి ప్రారంభించారు.
👉రవి ప్రకాష్ బ్యాటింగ్ చేసి మూర్తి బౌలింగ్ చేసి క్రికెట్ అకాడమీని ప్రారంభించారు, తర్వాత డి ఐ జి రవి ప్రకాష్ ఓపెన్ జిమ్ ప్రారంభించి కొద్దిసేపు జిమ్ చేశారు అనంతరం డి ఐ జి రవి ప్రకాష్ ని మూర్తిని వర్కింగ్ జర్నలిస్టులు ఘనంగా సన్మానించి మెమోంటో అందజేశారు
👉ఈ కార్యక్రమంలో షాకీర్ ,ఉపేంద్ర, దాదు, శ్రావణ్, రామంజి, రసూల్ ఆది, త్యాగరాజు, హనుమంత్ రెడ్డి, అరవింద్ రెడ్డి, రాము, ప్రకాష్, మల్లికార్జున, తేజ, రఘు, హరికృష్ణ, ప్రసాద్, ఇంకా పెద్ద ఎత్తున సీనియర్ క్రికెటర్లు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.
- =================