సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
1 min readఉపాధ్యాయ దినోత్సవం (Teachers’ Day) భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం అయిన సెప్టెంబర్ 5 వ తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటారు’.
ఈ రోజు సెలవుదినం కాదు.
ఉత్సవం జరుపుకొనవలసిన దినం. పాఠశాలలు యధావిధిగా జరిగి, ఉత్సవాలు జరుపుకుంటాభ్రరు. ఈ రోజున ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవసత్కారాలు జరుగుతాయి. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబరు 5 వ తేదీన జరుపుకుంటారు.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (సెప్టెంబర్ 5, 1888 – ఏప్రిల్ 17, 1975) భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి,
రెండవ రాష్ట్రపతి. భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టడం ఆయనకే చెందింది. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టారు, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో (చైనా, పాకిస్తాన్లతో యుద్ధ సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో ఉపాధ్యాయ విధులు నిర్వహించడం అనంతపురం వాసులకు గర్వించదగ్గ విషయం,
సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తోంది,
ఉపాధ్యాయులు గురుతత్వానికి కలిగి ఉండి తమ శిష్యులకు జ్ఞానాన్ని బోధించడం మనకు తెలిసిందే,
అటువంటి గురు తత్వాన్ని గురువులను గౌరవించుకోవడం ప్రతి శిష్యుని యొక్క ప్రథమ వీధి,