అన్నదాతలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ.
1 min readవర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయిందని అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ విమర్శించారు.
సోమవారం గుంతకల్ మండలంలోని ధోనిముక్కల, మల్లేనిపల్లి, నెలగొండ గ్రామాల్లో అకాల వర్షాల వల్ల వందల ఎకరాల్లో దెబ్బతిన్న వేరుశెనగ, మిరప, శనగ, కంది పంటలను పరిశీలించారు.
అకాల వర్షాల వల్ల అనేక గ్రామాల్లో పంట జలమయమైంది. అతివృష్టి వల్ల వేరుశనగ, మిరప పంట పూర్తిగా కుళ్లిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని, రైతులు సర్వంకోల్పోయే పరిస్థితి ఏర్పడిందని కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి అనంతపురం జిల్లాలో నెలకొని ఉంది.
పంట చేతికొస్తుంది అనుకుంటున్నా సమయంలో అకాల వర్షం వల్ల రైతులకు కష్టము తప్ప వేరే ఏమీ మిగలలేదు అని, కనీసం పంట పశువులకు మేతగా తినడానికి కూడా పనికి రాకుండా కుళ్లిపోయిందని, రైతుల పరిస్థితి ఎంత ఘోరంగాఉందో పొలాల్లోకి వెళ్లి చూస్తే అర్థమవుతుందినీ.
కావున రైతుల దుస్థితిని గమనించి తక్షణం ప్రభుత్వం నష్టపోయిన రైతుకు 30 వేలు పరిహారం పరిహారం ఇవ్వాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము అని చెప్పారు,
ఈ పర్యటనలో జనసైనికులు పాండు కుమార్, నాగరాజు, సూర్యనారాయణ, అనిల్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు…