వరదల కారణంగా దెబ్బతిన్న కల్వర్టులు, రోడ్లు, కోనేరు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించేందుకు కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి
1 min read*అనంతపురం జిల్లా కదిరి*
*యుద్ధ ప్రాతిపదికన కదిరి ఎమ్మెల్యే చర్యలు*
వరదల కారణంగా దెబ్బతిన్న కల్వర్టులు, రోడ్లు, కోనేరు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించేందుకు కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈ ఎన్ సి) వేణుగోపాల్ రెడ్డి, ఇంకా పలువురు ఆర్అండ్ బి అధికారులు, ఆలయ అధికారులు తో కలిసి ఎమ్మెల్యే కోనేరు తోపాటు హిందూపురం రోడ్ లో ఉన్న దెబ్బతిన్న కల్వర్టును పరిశీలించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా తొలుత తాత్కాలిక నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, ఆ తర్వాత శాశ్వత ప్రాతిపదికన బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే నిర్ణయం తీసుకున్నారు. కోనేరు ను ఆనుకొని ఉన్న కూలిన మద్ది లేరు వాగు కట్ట నిర్మాణానికి కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు.
భృగు తీర్థం( కోనేరు) లోకి మురుగునీరు రాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు ఎమ్మెల్యే అధికారులతో సమీక్షించారు. ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్లు రాజశేఖర ఆచారి, రామ్ ప్రసాద్, ఇస్మాయిల్, వైఎస్ఆర్సిపి నాయకులు సాదిక్ పిచ్చిలి శంకర్, కే ఎన్ కిష్టప్ప, ఉట్టి ఓం ప్రకాష్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.