బహుశా దేశం లోనే మొదటి జర్నలిస్టుల కాలనీ… మచ్చా రామలింగ రెడ్డి గారి కళల స్వప్నం నిజమైన సందర్భం
1 min readజర్నలిస్టులు సమాజ శ్రేయస్సు కోసం కుటుంభం కూడా సరిగా పట్టించుకునే వీలు లేక కష్టపడుతుంటారు,పగలు రాత్రి ఎండా వాన అనే సందర్భాలు, పండగలు పబ్బాలు పట్టించుకోకుండా ఎల్లా వేళల వార్తలను సేకరించి సర్వదా ప్రజలకు చేరుస్తుంటారు,
ఇటువంటి కష్టాలు స్వయంగా అనుభవం ఉన్న సీనియర్ పాత్రికేయులు మచ్చా రామలింగ రెడ్డి జర్నలిస్టుల కోసం ఒక సొంత ఇల్లు ఉంటె బాగుంటుంది, జర్నలిస్టులు ఐకమత్యంగా ఒక కుటుంబంగా ఉంటె బాగుంటుంది అని భావించి, జర్నలిస్టుల కు ఇళ్ల సాధనకై సడుంబిగించి దేశంలోనే ప్రధమంగా మన ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం నందు కోడమి జర్నలిస్టుల కాలానికి అంకురార్పణ చేయడం మచ్చా రామలింగ రెడ్డి కె సాధ్యం అయింది,
మచ్చా రామలింగ రెడ్డి ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులతో ఎన్నో పర్యాయాలు సంప్రదించి ఈ కోడిమి జర్నలిస్టుల కాలని ని సాధ్యం చేయడం విశేషం…
మచ్చా రామలింగ రెడ్డి ఇంకా అనేక సందర్భాలలో జర్నలిస్టుల కోసం అనేక పోరాటాలు చేశారు,
ప్రస్తుతం అయన జర్నలిస్టుల కోసం ప్రభుత్వాన్ని కోరుతున్న విషయాలు ఏ విధంగా …
*జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు అక్రిడిటేషన్ తో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇవ్వాలి*
*చిన్న పత్రికల అక్రిడేషన్లు డిసెంబర్ వరకు పొడగించాలి*
*యూట్యూబ్ చానల్స్ కు అక్రిడేషన్ల విధి విధానాలు ఖరారు చేయాలి*
*రాష్ట్ర వ్యాప్తంగా APWJU నూతన కమిటీ ఏర్పాటు*
*జర్నలిస్టులకు 10 వేలు పింఛన్ సౌకర్యం కల్పించాలి*
*ఉద్యోగస్తులు మాదిరిగా జర్నలిస్టులకు MIG లే అవుట్ లో ప్లాట్లు కేటాయించాలి*
*రాష్ట్రంలోని జర్నలిస్టు కాలనీలకు ప్రభుత్వం నిధులు కేటాయించాలి*
*వైయస్ జగన్ జర్నలిస్టుల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలి*
జర్నలిస్టుల శ్రేయస్సే ప్రధానంగా పోరాడుతున్న మచ్చా రామలింగ రెడ్డి గారి ఆశలు నిరవేరాలని ఆశిస్తూన్నాము …