అమరావతి పార్టీ కేంద్ర కార్యాలయం లో Nara Chandrababu Naidu గారి అధ్యక్షతన జరిగిన టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం లో సహచర పార్టీ నాయకులతో వైకుంఠం ప్రభాకర్ చౌదరి కలసి పాల్గొనడం జరిగింది.
1 min readఅమరావతి పార్టీ కేంద్ర కార్యాలయం లో Nara Chandrababu Naidu గారి అధ్యక్షతన జరిగిన టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం లో సహచర పార్టీ నాయకులతో వైకుంఠం ప్రభాకర్ చౌదరి కలసి పాల్గొనడం జరిగింది.
మంగళగిరి: నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న టిడిపి రాష్ట్ర కమిటీ సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ప్రారంభోపన్యాసం లోని ముఖ్యాంశాలు.
రాష్ట్రంలో సంక్షేమం అనేది మొదట పరిచయం చేసింది ఎన్టీఆర్. ఆహార భద్రతకు నాంది పలికింది ఎన్టీఆర్.
• పేద పిల్లల కోసం గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టింది ఎన్టీఆర్
• పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టింది ఎన్టీఆర్. పాలనలో సంస్కరణలు మొదలు పెట్టింది ఎన్టీఆర్.
• తెలుగు దేశం జాతీయ భావాలు ఉన్న ప్రాంతీయ పార్టీ. టిడిపి గత విజయాలు నెమరవేసుకోవాలి. ప్రజలకు గుర్తు చెయ్యాలి.
• ఆత్మగౌరవంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా అవసరం నాడు చాటి చెప్పాం.
• నేటి రాష్ట్రం లో పరిస్థితి చూస్తున్నాం….పాలకుడికి ఉండాల్సింది విజన్ కానీ విద్వేషం కాదు.
• నేడు ఎక్కడ చూసినా విద్వేషమే….పాలకుల విజన్ పోయి పాయిజన్ గా తయారయ్యింది.
• తమకు రావాల్సిన బకాయిలపై అనంతపురంలో కానిస్టేబుల్ ప్ల కార్డు పట్టుకున్నాడు.
• దీంతో ఆయనను టార్గెట్ చేశారు….ఉద్యోగం నుంచి తొలగించారు.
• కానిస్టేబుల్ తనను వేధించలేదు అని చెప్పిన శ్రీలక్ష్మిని వేధిస్తున్నారు.
• కానిస్టేబుల్ ప్రకాష్ ఇప్పుడు కనపడడం లేదు.
• సమస్యల ను ప్రస్తావిస్తే..దాడులు, విధింపులకు పాల్పడుతున్నారు.
• నాడు విజన్ తో చేసిన పాలనతో ఇప్పుడు హైదరాబాద్ మంచి స్థానంలో ఉంది.
• ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నతి స్థితిలో ఉండడమే నాకు అన్నిటికంటే సంతృప్తి
• 27 ఏళ్ల క్రితం మనం చేసిన పనులు..ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయి.
• విభజన వల్ల నష్టం జరిగింది…అయినా నాడు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాం.
• 200 పెన్షన్ 2000 చేశాం….ఉద్యోగులకు 42 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం.
• జగన్ ఇప్పుడు ఒక్కో కుటుంబం పై మూడేళ్లలో 3.25 లక్షల రుణ భారం వేశారు.
• దేశంలో ఎక్కువ పెట్రో ధరలు ఉండే రాష్ట్రం ఏపీనే
• వృత్తి పన్ను, ఆస్థిపన్ను, చెత్త పన్ను అని ఇష్టం వచ్చినట్లు పన్నులు వేశారు.
• టిడిపి పెట్టిన అన్న క్యాంటీన్ రద్దు చేశారు…ఇప్పుడు అన్నదానం చేస్తున్న వారిపైనా దాడులు చేస్తున్నారు.
• నాడు డొక్కా సీతమ్మ అన్నదానం చేశారు…అన్నదానానికి ఆమే స్ఫూర్తి.
• నందిగామలో చివరికి కోర్టుకు వెళ్లి అన్న క్యాంటీన్ నిర్వహణకు అనుమతులు తెచ్చుకున్నాం.
• రాష్ట్రంలో అటు పన్నుల భారం…ఇటు అప్పుల భారం.
• ఎస్సీలకు ఉన్న 26 పథకాలు రద్దు చేశారు. సబ్ ప్లాన్ తీసేశారు.
• చింతూరులో వరదల సమయంలో సిఎం జగన్ పిలిచి మాట్లాడిన బాలిక డెంగ్యూ వచ్చి చనిపోయింది.
• దీనికి సిఎం ఏం సమాధానం చెపుతారు….ఇది ప్రభుత్వ హత్య కాదా.
• వరద ప్రాంతం లో దోమల నివారణకు ఎందుకు చర్యలు తీసుకోలేదు.
• విదేశీ విద్యను ఆపేశారు….బిసిలకు ఒక్క పథకం లేదు.
• కాపు కార్పొరేషన్ కు నిధులు లేవు.
• రాష్ట్రంలో ఒక్క రైతు కూడా సంతోషంగా లేరు.
• కనీసం ధాన్యం డబ్బులు కూడా చెల్లించడం లేదు. దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
• రాష్ట్రంలో ఇసుక దొరక్క…భవన నిర్మాణ కార్మికులు అంతా రోడ్డున పడ్డారు.
• చేనేత, గీత, మత్స్య కారులు, ఆటో డ్రైవర్లు…ఇలా అన్నీ వర్గాలు జగన్ పాలనలో దెబ్బతిన్నారు.
• పక్క రాష్ట్రం నుంచి మద్యం తెచ్చేవారికి నో చెక్ పోస్ట్…గంజాయి తెచ్చే వారికి చెక్ పోస్ట్ లేదు….సిపిఎస్ ఉద్యోగులకు మాత్రం చెక్ పోస్ట్ లు పెడుతున్నారు.
• ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అన్నారు, పోలవరం, అమరావతి పూర్తి చేస్తాం అన్నారు.
• మద్య పాన నిషేదం చేస్తేనే ఓటు అడుగుతాం అన్నారు….కానీ 25 మద్యం అమ్మకాలపై అప్పులు తెచ్చారు.
• దేశంలో దళితులు, గిరిజనులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి.
• రాష్ట్రంలో ఆడబిడ్డలపై 31 శాతం దాడులు పెరిగాయి. ఈ విషయాలు నేషనల్ క్రైం బ్యూరో చెపుతున్న నివేదిక.
• ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదు కానీ…వైసిపి ఆదాయం మాత్రం భారీగా పెరిగింది.
• జగన్ ఈ మూడేళ్లలో 2 లక్షల కోట్లు అక్రమంగా ఆర్జించారు.
• లేపాక్షిలో భూములు కొట్టేశారు. 20 కోట్లు ఆదాయం లేని కంపెనీతో 500 కోట్లు పెట్టి వేల కోట్ల భూములుకొట్టేశారు.
• సొంత కంపెనీకి మైనింగ్ ఇచ్చారని హేమంత్ సోరెన్ సభ్యత్వం రద్దుపై ప్రతిపాదనలు చేశారు. సరస్వతీ భూముల విషయంలో జగన్ చేసిన దానికి ఏమి చెయ్యాలి.
• రాష్ట్రంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారు. కొవ్వూరు అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో గెలిచిన పానెల్ ను జగన్ రద్దు చేశారు. హైకోర్టు చీవాట్లు పెట్టి మళ్లీ వారికే అధికారం ఇచ్చింది.
• సంస్థాగత విషయాల్లో రాజీ పడేది లేదు….సభ్యత్వ నమోదు పూర్తి చెయ్యాలి.
• పార్టీ కి సంబంధించి గ్రామ స్థాయి వరకు కమిటీలు పూర్తి చెయ్యాలి.
• ఓటర్లు వెరిఫికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మన ఓట్లు ఉండవు. ప్రజల్లో ఎంత చైతన్యం ఉన్నా మన ఓట్లు లేకపోతే ఏమీ చెయ్యలేం. జాగ్రత్తగా ఉండాలి.
• గ్రాడ్యుయేట్ ఎన్నికల విషయంలో పార్టీ నేతలు బాధ్యత తీసుకోవాలి
• రాష్ట్రంలో ఇంత అరాచకం ఉంటే కొన్ని టీవీలు తిరిగి మనల్నే విమర్శిస్తున్నాయి.
• అందుకే నీలిమీడియా గా ఉన్న టివి9, ఎన్టీవిని దూరంగా పెట్టాలి… వారికి బాధ్యత గుర్తు చెయ్యాలి.
• నేతలు సొంత సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకోవాలి. విస్తృతంగా ఉపయోగించుకోవాలి.
• దుర్మార్గుల చేతిలో టెక్నాలజీ ఉంటే మరింత ఎక్కువ నష్టం. మనం అప్రమత్తంగా ఉండాలి.
• రాష్ట్రంలో ఇంట్లోంచి టిడిపి నేతలు భయటకు వస్తే కేసులు పెడుతున్నారు.
• జగన్ కు నిద్రలో కూడా టిడిపి నేతలే గుర్తుకు వస్తున్నారు.
• పోలీసులు లేకుండా వైసిపి వాళ్లు వస్తే….ఒక్క నిముషంలో వారి పని తేలిపోతుంది. ఇది మన సవాల్.
• నేతలు తమ సౌకర్యం కోసం ఇంట్లో పడుకుంటే….ఎన్నికల అనంతరం కూడా ఇంట్లో ఉండాల్సి వస్తుంది.
• కేసులు, దాడులపై న్యాయ పరంగా, రాజకీయంగా పోరాడుతాం. ఎవరిని వదలం.
• ఇప్పటికీ నాపై కేసులు పెట్టేందుకు వెతుకుతున్నాడు. మన పేరు చెప్పమని కేసులు పెట్టి బాధితులను ఒత్తిడి చేస్తున్నాడు.
• జగన్ అక్రమాలకు అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అవినీతి బుదర మనకూ అంటించే ప్రయత్నం చేస్తున్నాడు.
• ఎన్నికలకు 18 నెలల సమయం ఉంది. జగన్ ఇంకా ముందు ఎన్నికలకు వెళితే రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుంది.
• ఇప్పుడు ఎక్కడా పొత్తుల గురించి నేను మాట్లాడడం లేదు. పార్టీలో కూడా ఈ విషయంలో క్లారిటీ ఉండాలి.
• ముందు రాష్ట్రాన్ని కాపాడాలి.. దానికి అందరూ కలిసి రావాలి. మేథావులు, ఉద్యోగులు సహా అందరూ కలిసి రావాలి.
• నియోజకవర్గ ఇంచార్జ్ 10 రోజులు నియోజకవర్గంలో ఉండాలి. నియోజకవర్గ అబ్జర్వర్ 8 రోజులు నియోజకవర్గంలో ఉండాలి.
• భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులుగా ఉంటారు. వారిని గెలిపించే బాధ్యత పార్టీ నేతలు తీసుకోవాలి.
• రాష్ట్రంలో తెలుగు దేశం అధికారంలోకి వస్తేనే రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యం.
• అప్పట్లో ఎక్కువ సమయం పార్టీకి పెట్టలేదు కాబట్టి సమస్యలు వచ్చాయి.
• పార్టీపై దృష్టిపెట్టిన సందర్భంలో మనకు ఓటమి లేదు.
• పాలనలో నేను పడిపోయినప్పుడే సమస్యలు వచ్చాయి. నేను సైతం నన్ను సరి చేసుకుంటున్నాను.
క్విట్ జగన్…. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం అమల్లోకి తేవాలి.