ఉచిత రేషన్ ఎగ్గొట్టొద్దు పేదల కడుపు కొట్టొద్దు అంటూ పాలకొల్లులో రేషన్ షాపులు దగ్గర నిరసన తెలియజేసి పాలకొల్లు
1 min readఉచిత రేషన్ ఎగ్గొట్టొద్దు పేదల కడుపు కొట్టొద్దు అంటూ పాలకొల్లులో రేషన్ షాపులు దగ్గర నిరసన తెలియజేసి పాలకొల్లు ఎమ్మార్వో ఆఫీస్ కు నిరసన ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే Dr.Nimmala Rama Naidu, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ .
కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యాన్ని 4 నెలలు జగన్ ఎగ్గొట్టడంతో ఒక్కొక్క కుటుంబం 2800 రూ. నష్టపోయారు. కేంద్రం కన్నెర్రతో ఆగస్టులో ఉచిత బియ్యం అందించినా తెల్ల రేషన్ కార్డులలో వివక్ష చూపి, ఒకరికి ఇచ్చి మరొకరికి నిలిపివేయడం ఆహార భద్రత చట్టాన్ని జగన్ ఉల్లంఘించడమే.
చంద్రబాబు హయాంలో ఇచ్చిన 8 రకాల నిత్యవసరాలతో పాటు సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకలను జగన్ రద్దుచేసి పేదల వ్యతిరేకి అని రుజువు చేసుకున్నాడు. కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యం పేదలకు కాకుండా, జగన్ అనుయాయులతో విదేశాలకు రీసైక్లింగ్, స్మగ్లింగ్ జరుగుతుంది అన్నారు.