మన ఇండియా సురక్షితం,పీర్స్ అమెరికా అనే వృద్ధుడు
1 min readనేను అమెరికా వెళ్ళను..ఇబ్బంది పెట్టకండి…!
ప్లీజ్ నన్ను కేరళ నుంచి అమెరికాకు పంపించకండి, కరోనాను కట్టడి చేయడంలో అమెరికా ఫెయిల్ అయింది… ఇక్కడే ఉంటాను అంటూ కేరళ హైకోర్టుకు ఆశ్రయించిన పీర్స్ అమెరికా అనే వృద్ధుడు.
అమెరికా నుంచి ఫిబ్రవరిలో పీర్స్ అనే వృద్ధుడు ఇండియాకు టూరిస్ట్ గా వచ్చాడు. కేరళలో అనేక పర్యాటక ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఇప్పుడు కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. తాను ఉంటానని, తన టూరిస్ట్ వీసాను బిజినెస్ వీసాగా మార్చాలని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు. కరోనాను కట్టడి చేయడంలో అమెరికా ఫెయిల్ అయ్యిందని, దానికి ఉదాహరణ అక్కడ పెరుగుతున్న కేసులే అని అన్నారు. ఇండియా కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు ఎంతగానో బాగున్నాయని, తాను ఇండియాలోనే ఉండిపోవాలని అనుకుంటున్నట్టు పీర్స్ పేర్కొన్నాడు. తాను ఇండియాలో టూరిస్ట్ కంపెనీ పెట్టాలని ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పాడు. పీర్స్ టూరిస్ట్ వీసా ఆగష్టు 24 తో ముగుస్తున్న నేపథ్యంలో అయన హైకోర్టును సంప్రదించడం విశేషం…!