ఇంటి స్థలాల పరిశీలన YSRCP తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
1 min readఅనంతపురము లైవ్ న్యూస్
తాడిపత్రి 18-డిసెంబర్ 2020 : ప్రభుత్వం నిరుపేదల కోసం ఉచితంగా ఇస్తున్న ఇంటి స్థలాలను గుర్తించిన లేఅవుట్లలో సిద్ధం చేయాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రి రూరల్ మండల పరిధిలోని సజ్జలదిన్నె గ్రామ సమీపం నందు అధికారులు గుర్తించిన లే అవుట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సొంతింటి కలను సాకారం చేయడానికి ప్రభుత్వం ఈనెల 25వ తేదీన ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినందన్నారు. అందుకోసం గుర్తించిన స్థలాలలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అదేవిధంగా లేఅవుట్ నందు తప్పనిసరిగా అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు నాటించాలని ఆయన అధికారులకు తెలియజేశారు. అనంతరం ఆయన ఆర్ డి టి కాలనీ సమీపంలో నిర్మిస్తున్న ఇళ్లను కూడా పరిశీలించారు. ఇంటి నిర్మాణాలకు సంబంధించిన పనులను నాణ్యతగా చేపట్టాలని ఆయన పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్కు సూచించారు.