ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు-. శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి
1 min readఅనంతపురము లైవ్ న్యూస్ 22 డిసెంబర్ 2020:
ప్రేమ, త్యాగనిరతికి చిహ్నం క్రిస్మస్ పండుగ.. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.ప్రేమ, త్యాగనిరతికి చిహ్నం క్రిస్మస్ పండుగని ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి పేర్కొన్నారు. సాయినగర్ లో ఉన్న అంబేద్కర్ భవన్ లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అధ్యక్షతన సోమవారం రాత్రి క్రిస్మస్ పండుగ సందర్భంగా తేనేటి విందు మరియు క్రిస్మస్ వేడుకల ( హై టీ ప్రోగ్రాం) కార్యక్రమంను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి పాల్గొన్నారు.పద్మావతి మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం చాలా సంతోషకరమని, ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మైనారిటీ, డీజేబుల్ వెల్ఫేర్, ట్రైబుల్, బిసి, ఎస్ ఈ, సోషల్ వెల్ఫేర్ శాఖల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు క్రిస్మస్ కేకును కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.