*క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.
1 min readఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో సీఎం జగనన్న పాల్గొన్నారు. కప్పగంతుల సుబ్బరామ సోమయాజులు గారి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. పంచాంగ శ్రవణ కార్యక్రమంలో సీఎం జగనన్న, మంత్రులు పాల్గొన్నారు. సంక్షేమం దిశగా సీఎం వైయస్ జగన్ పాలన ఉంటుందని శాస్త్రి తెలిపారు. విద్యా విధానాల్లో కొత్త మార్పులు వస్తాయన్నారు. కొత్త ఏడాదిలో సంక్షేమ పథకాలను సీఎం వైయస్ జగన్ సమర్ధవంతంగా అమలు చేస్తారని అన్నారు. ఈ ఏడాది ఎన్నో విజయాలు సాధిస్తారని పేర్కొన్నారు. ప్లవనామ సంవత్సరంలో కూడా వరుణుడి అనుగ్రహం ఉంటుందని.. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు. పాడిపరిశ్రమ చక్కని ఫలితాలు అందుకుంటుందన్నారు. ఈ ఏడాది రైతులకు లాభదాయకంగా ఉంటుందని శాస్త్రి తెలిపారు. అనంతరం పలువురు అర్చకులను సీఎం జగనన్న సన్మానించారు.*