దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు…
1 min readఅనంతపూర్ లైవ్ న్యూస్ 21 ఏప్రిల్:- దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు…
భారతదేశంలోని ప్రజలందరికి ఇల్లు, ఆహారం, ఆరోగ్యం, విద్య అందించే ముఖ్య లక్ష్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది.
ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, తద్వారా ప్రజలు వారివారి ప్రాథమిక హక్కులను పొందేలా చూడాలన్న ఉద్దేశ్యంతో జాతీయ పౌర సేవల సంస్థ 2016, ఏప్రిల్ 21 ఈ పౌర సేవల దినోత్సవాన్ని ప్రారంభించింది.
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రధానమంత్రి పేరిట అవార్డులను ఇవ్వడం జరుగుతుంది. 2006లో ప్రారంభించబడిన అవార్డుల ప్రకారం, వ్యక్తిగతంగా లేదా సమూహంగా లేదా సంస్థగా ఉన్న ప్రతినిధులందరు ఈ పథకానికి అర్హులు. వ్యక్తిగత బహుమతి లక్ష, సంస్థ బహుమతి ఐదు లక్షలు ఉంటుంది.
పౌర సేవల విషయంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటానికి భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలోనన్న అంశంపై పౌర సేవల ఉద్యోగు లకు శిక్షణా కార్యాక్రమాలు నిర్వహించబడుతాయి.
పౌరసేవల గురించి, పౌరులహక్కుల గురించి గ్రామస్థాయిలో గ్రామస్తులకు, విద్యార్థులకు అవగాహన కలిపిస్తారు…
వి.మల్లయ్య
రిపోర్టర్
అనంతపురం న్యూస్ అనంతపురం