ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టండి
1 min readపోలీసు సిబ్బంది, అధికారులతో ప్రత్యేక సమావేశం… చేపట్టాల్సిన చర్యలుపై దిశానిర్ధేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పర్యటన బందోబస్తు పటిష్టంగా చేపట్టాలని జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS గారు సూచించారు. రాయదుర్గం పట్టణంలో ఈరోజు బందోబస్తులో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. భద్రతా చర్యలుపై సమీక్ష చేశారు. ఏమి చేయాలో, ఏమి చేయకూడదో దిశానిర్ధేశం చేశారు. ముఖ్యమంత్రి గారు పర్యటించే ప్రాంతాలు, రహదారులు, సభాస్థలి, హెలిప్యాడ్ ప్రదేశాలలో తీసుకోవాల్సిన బందోబస్తు చర్యలపై చర్చించి పోలీసు అధికారులకు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీతో పాటు సెబ్ అదనపు ఎస్పీ జె.రాంమోహనరావు, పలువురు డీఎస్పీలు, సి.ఐ లు, ఎస్సైలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
* జిల్లా పోలీసు కార్యాలయం, అనంతపురం *