ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించిన డి.ఐ.జి, ఎస్పీలు
1 min readఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పర్యటన బందోబస్తు ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా ఈరోజు అనంతపురం రేంజ్ డి.ఐ.జి శ్రీ కాంతి రాణా టాటా IPS గారు, జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS గారు సంయుక్తంగా రాయదుర్గం పట్టణం, పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ముఖ్యమంత్రి గారు పర్యటించే ప్రాంతాలు, రహదారులు, సభాస్థలి, హెలిప్యాడ్ ప్రదేశాలలో తీసుకోవాల్సిన బందోబస్తు చర్యలపై చర్చించి పోలీసు అధికారులకు సూచనలు చేశారు.
* జిల్లా పోలీసు కార్యాలయం, అనంతపురం