LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

July 2022
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
2nd July 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

నూతన సంవత్సర వేడుకలు నిషేధం …

1 min read

అనంతపురం నూతన సంవత్సర వేడుకలకు ఎలాంటి అనుమతులు లేవని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఫక్కీరప్ప హెచ్చరించారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. ఒమిక్రాన్‌ కేసులు నమోదవుతున్న క్రమంలో నిబంధనల అమలు కఠినతరం చేయాలని పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. నూతన సంవత్సర వేడుకలు, తర్వాత వచ్చే సంక్రాంతి, శివరాత్రి పండగలు నిబంధనల మేరకే నిర్వహించుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో కేక్‌ కోయడం, బాణసంచా పేల్చడం, గుంపులుగా చేరి అల్లరి చేయడం వంటి వాటికి అనుమతులు లేవన్నారు. సంప్రదాయ కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. మద్యం దుకాణాలు, బార్‌, రెస్టారెంట్లకు సమయం పొడిగింపు ఉండదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి సంబరాలు చేసుకోవడం, ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తీసేసి నడపడంపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. డిసెంబరు 30 నుంచి జనవరి 1 వరకు మూడు రోజుల పాటు నిబంధనలు అమలులో ఉంటాయన్నారు…..