వైఎస్‌ఆర్ భీమా నగదును పంపిణీచేసిన నెరిమెట్ల గ్రామ సర్పంచ్ యోగేంద్ర రెడ్డి………..!
1 min readఅనంతపూర్ లైవ్ న్యూస్ ఉరవకొండ జనవరి 12 :-
ఉరవకొండ మండలంలోని నెరమెట్ల గ్రామంలో బుధవారం గ్రామ సర్పంచ్ యోగేంద్రరెడ్డి బాధిత కుటుంబానికి వైఎస్‌ఆర్ భీమా నగదును అందజేశారు.
నెరమెట్లకు చెందిన కురుబ పర్వతరెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన భార్య కురుబ లక్ష్మమ్మకు వైఎస్‌ఆర్ భీమా పథకం కింద రూ.2 లక్షలు మంజూరైంది. దానిని సర్పంచ్ అందజేశారు. కార్యక్రమంలో నాయకులు లింగప్ప, వెళ్ఫెర్ అసిస్టెంట్ మల్లికార్జున పాల్గొన్నారు, అని అనంతపూర్ లైవ్ న్యూస్ కు తెలిపారు.
ఈ.శ్రీనివాస్ నాయుడు
అనంతపూర్ లైవ్ న్యూస్ రిపోర్టర్ ఉరవకొండ.
9515255012