దేశాన్ని కాపాడండి ప్రజలను రక్షించండి నినాదంతో, మేడే ను జయప్రదం చేయాలి..!
1 min readసిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. నాగేంద్ర కుమార్ పిలుపు ప్రపంచ కార్మిక దినోత్సవం 136వ మేడే దినోత్సవం జయప్రదం చేయాలని అనంతపురం CITU జిల్లా ప్రధాన కార్యదర్శి పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా పత్రిక ప్రతినిధులు లతో నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ, ఎనిమిది గంటల పని విధానాన్ని కాపాడుకోవాలని, దేశాన్ని కాపాడాలని, ప్రజలను రక్షించాలని, నినాదంతో, మేడే ఉత్సవాలను జయప్రదం చేయాలని, ఉద్యోగులు కార్మికులు, కర్షకులకు, పిలుపునిచ్చారు.
అమెరికా చికాగో నగరంలో కార్మికుల మృత వీరుల త్యాగాల ఫలితం 1886 లో పోరాట ఫలితంగా ఎనిమిది గంటల పని సాధించడం జరిగింది అన్నారు. నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, దేశంలో పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, నాలుగు కోడులు గా, పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చి వేశారు అన్నారు. పన్నెండు గంటలకి పనిగంటలు పెంచడం చేశారన్నారు. దీన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు, ప్రభుత్వ సంస్థలను, ప్రజల ఆస్తులను, కేంద్రంలో బిజెపి కారుచౌకగా , అమ్మేస్తున్నని, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని, ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, విపరీతంగా, నిత్యవసర వస్తువులు ధరలు, పెంచడం , విపరీతంగా పన్నులు వేయడం, పేద మధ్య తరగతి ప్రజలు, పైన భారాలు వేస్తున్నారన్నారు. ఏడాది పాటు జరిపిన రైతు ఉద్యమం స్ఫూర్తిదాయకం అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, పోరాడాలని, మతతత్వానికి వ్యతిరేకంగా, లౌకికతత్వం కోసం కృషి చేయాలని కోరారు, సోషలిస్టు సమాజం లోనే కార్మికులు, కర్షకులకు, రక్షణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు నాగమణి, నగర కార్యదర్శులు వెంకటనారాయణ, ముర్తుజా తదితరులు పాల్గొన్నారు.
.