LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

July 2022
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
2nd July 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

ఘనంగా నిర్వహించిన డాక్టర్ జగ్జీవన్ రామ్ గారి మరియు ప్రేమ్ కుమార్ గారి వర్ధంతి.

1 min read

ఘనంగా నిర్వహించిన డాక్టర్ జగ్జీవన్ రామ్ గారి మరియు ప్రేమ్ కుమార్ గారి వర్ధంతి.

 

అనంతపూర్ లైవ్ న్యూస్,

హిందూపురం.

ఏప్రిల్:05

ఈరోజు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 114వ జయంతి మరియు కీర్తిశేషులు కే ప్రేమ్ కుమార్ గారి 5 వర్ధంతిని పురస్కరించుకొని NGO హోమ్ నందు సంస్మరణ సభ ఎమ్మార్పీఎస్ తాలూకా అధ్యక్షులు కే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో MEF నాయకులు రామకృష్ణ గారు ఎమ్మార్పీఎస్ నాయకులు H ఆంజనేయులు గారు ఆర్టీసీ బాబయ్య గారు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు డి.ఈ.రమేష్ కుమార్ గారు మహిళా కార్యదర్శి రామాంజి నమ్మ గారు మాజీ సర్పంచ్ రాము, శివ, తెలుగు యువత పార్లమెంట్ ఉపాధ్యక్షులు భార్గవ్, ఎంఎస్ఎఫ్ నాయకులు బాబి, మధు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగజ్జీవన్ రాం గారు భారతదేశానికి చేసినటువంటి సేవలను బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి కృషిని స్మరించుకున్నారు. అంతేకాదు కీర్తిశేషులు ప్రేమ్ కుమార్ గారు మన నియోజకవర్గ వ్యాప్తంగా దళితుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని ఆయన చేసినటువంటి సేవలను మరువలేనివని వక్తలు కొనియాడారు.

కీర్తిశేషులు ప్రేమ్ కుమార్ గారి వర్ధంతిని పురస్కరించుకొని పరిగి బస్ స్టాండ్ ఆవరణం నందు శ్రీ ఆదిజాబవంతాస్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వన్ టౌన్ సిఐ ఇస్మాయిల్ సార్ గారు విచ్చేసి ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి మీరు చేసినటువంటి కృషి ఎంతో గొప్పది అని తెలియజేశారు.

అంతే కాకుండా ప్రేమ్ కుమార్ గారి వర్ధంతిని పురస్కరించుకొని బీసీ హాస్టల్ నందు గల బాలికలకు డ్రెస్ మెటీరియల్ మరియు వాటర్ బాటిల్స్ ను ఎమ్మార్పీఎస్ తాలూకా అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ 18 వ వార్డు కౌన్సిలర్ సతీష్ కుమార్ అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మేలాపురం వాసులు నరసింహులు,నాగన్న బాబు, అంజి,సడ పల్లి నాగరాజు, కొట్నూరు కిష్టప్ప, రాజు, లక్ష్మణ్ మొదలైనవారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.

 

సుధీర్ కుమార్,

రిపోర్టర్,

అనంతపూర్ లైవ్ న్యూస్

హిందూపురం.