Anantapur Live News

www.anantapurlivenews.com

సర్ధార్ వల్లభాయ్ పటేల్ 145 వ జయంతి పురస్కరించుకుని పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జాతీయ సమైక్యతా దినోత్సవం

1 min read

అనంతపురం జిల్లా: తేది: 31-10-20

సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో సమర్థ విధులు

* సర్ధార్ వల్లభాయ్ పటేల్ 145 వ జయంతి పురస్కరించుకుని పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జాతీయ సమైక్యతా దినోత్సవం

మన దేశ తొలి ఉప ప్రధాని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితోనే రక్షణ బలగాలు దేశ అంతర్గత భద్రతను కాపాడుతున్నాయని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 145 జయంతి
పురస్కరించుకుని శనివారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు వాల్మికి మహర్షి చిత్రపటాలకు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ” దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితమవుతానని, అంతేగాక, ఈ సందేశాన్ని తోటివారందరిలో విస్తరింపచేయడానికి గట్టిగా కృషి చేస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దార్శనికత, చర్యల వల్ల లభ్యమైన నా దేశ ఏకీకరణ స్పూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతేగాక, నా దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి స్వీయ తోడ్పాటు అందిస్తానని సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాను.” అని సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ… భారత దేశపు ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్య యోధుడిగా అనేక సేవలు అందించాడన్నారు. స్వాతంత్ర్యానంతరం కూడా రాజరిక సంస్థానాలను
విలీనంలో చేయడానికి గట్టి కృషి చేశారని గుర్తు చేశారు. జాతీయోద్యమానికి ఆకర్షితుడైన పటేల్ మహాత్మా గాంధీజీ నాయకత్వంలో కొనసాగిన ఉద్యమాల్లో పాలుపంచుకున్నాడన్నారు. బ్రిటీష్ ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా జరిపిన కిసాన్ ఉద్యమం మరియు సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడన్నారు. దేశ ప్రజల సంక్షేమం కోసం చాలా సాంఘిక ఉద్యమాలను చేపట్టిన ఘనతే
పటేల్‌కు దక్కుతుందన్నారు. గుజరాత్ రాష్ట్రంలో మద్యపానం, అస్మశృత, కుల వివక్షలకు వ్యతిరేకంగా పని
చేశారన్నారు.

 

రాజ్యాంగ సభ సభ్యుడిగా, మంచి నాయకుడిగా భారత ప్రజలకు ఎనలేని సేవలందించి చరిత్ర పుటల్లో అగ్రస్థానంలో నిలవడం ముదావహమన్నారు. పటేల్ చేసిన సేవలకు ప్రభుత్వం గురించి 1991 సంవత్సరంలో “భారతరత్న” అవార్డును కూడా ప్రదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్పీ హనుమంతు, ఎస్బీ డీఎస్పీ ఏ.రామచంద్ర, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు పెద్దయ్య, శ్రీశైలరెడ్డి, శివరాముడు, టైటాస్ , శివన్న, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక నాథ్ , చంద్రశేఖర్, జాఫర్ , సుధాకర్ రెడ్డి, పలువురు ఆర్.ఎస్.ఐ.లు, ఏ.ఆర్. మరియు స్పెషల్‌ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

लाइव कैलेंडर

November 2020
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

LIVE FM सुनें

ADS 2020