గుంటూరు రమ్య హత్య కేసులో రాష్ట్ర పోలీసుల పనితీరు ప్రశంసనీయం
1 min read* హత్య జరిగిన గంటలోపే నిందితుల అరెస్టు…ఆరు రోజుల్లో ఛార్జిషీటు దాఖలు
* న్యాయశాఖతో సమన్వయం చేసుకుని నిందితుడికి శిక్షపడేలా కార్యాచరణ
* రామగిరి పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ
* శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడకండి
— జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS
గుంటూరు రమ్య హత్య కేసులో రాష్ట్ర పోలీసుల పనితీరు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు పేర్కొన్నారు. హత్య జరిగిన గంటలోపే నిందితుల్ని అరెస్టు చేశారన్నారు. ఆరు రోజుల్లో ఛార్జిషీటు దాఖలు చేశారని…న్యాయశాఖతో సమన్వయం చేసుకుని నిందితుడికి శిక్షపడేలా కార్యాచరణకు దిగడం ముదావహమన్నారు. రామగిరి పోలీసు స్టేషన్ ను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసుస్టేషన్ నిర్వహణ, రికార్డులు, పరిసరాలను పరిశీలించారు. పోలీసు స్టేషన్లోని ఉమెన్ హెల్ప్ డెస్క్ , రిసెప్సన్ , రికార్డు రూం, అధికారుల కార్యాలయాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మహిళల భద్రతకు ప్రభుత్వం, పోలీసుశాఖ పెద్దపీట వేసిందన్నారు. దిశ యాప్ మహిళల రక్షణకు బాగా దోహదం చేస్తోందన్నారు. జిల్లాలో కూడా మహిళల భద్రత కోసం దిశ SOS యాప్ ను సుమారు 7 లక్షల డౌన్లోడ్ మరియు 2,21,655 రిజిస్ట్రేషన్లు చేయించామన్నారు. ఈ యాప్ పట్ల విస్తృతంగా అవగాహన చేస్తున్నామన్నారు. అంతేకాకుండా… శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచించామన్నారు. మట్కా, పేకాట, గుట్కా, కర్నాటక మద్యం, ఇసుక అక్రమాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీతో పాటు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ , సి.ఐ చిన్నగౌస్ , తదితరులు ఉన్నారు.