సైబర్ అలర్ట్ ….. అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS
1 min read
సైబర్ అలర్ట్ ….. అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS
TOPIC : “ Safety tips to be Social Media Account to avoid the Cyber Crimes Frauds“
మీకు Facebook, Instagram, Twitter వంటి సామాజిక మాధ్యమాలలో అకౌంటు ఉందా అయితే మీరు జాగ్రత్త !.
ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు ఇటువంటి సామాజిక మాధ్యమాల అక్కౌంట్స్ ను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు.
కావున సైబర్ నేరగాళ్లకు ఆ అవకాశం ఇవ్వకుండా చూసుకోవలసిన బాధ్యత ఉంది. దీనికోసం ఈ విధమైన సెట్టింగ్స్ ను మీ యొక్క అక్కౌంట్స్ కు చేసుకోవటం ఎంతో ఆవశ్యం.
** అందులో ముఖ్యమైనవి:
మీ Facebook అకౌంటు నందు కల సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ నందు సెట్టింగ్స్ కి వెళ్ళి ప్రైవసీ కి వెళ్ళి ఎవరెవరు మీ పోస్టుల ను చూడవచ్చు అనే చోట స్నేహితులు మాత్రమే లేదా నేను మాత్రమే చూడాలి అనే విధంగా సెట్టింగ్ ఉంచుకోవాలి.
ఎవరెవరు మీ ఫ్రెండ్స్ లిస్ట్ ను చూడవచ్చు అనే చోట కేవలం నేను మాత్రమే లేదా స్నేహితులు మాత్రమే అని పెట్టుకోండి. మీరు ఉంచిన మీ వ్యక్తిగత వివరాలను ఎవరెవరు చూడవచ్చు అనే చోట కేవలం నేను మాత్రమే అని ఉంచండి.
మీ అక్కౌంట్స్ కు టూ ఫాక్టర్ అథంటికేషన్ ను ఆన్ చేసుకోండి. ఇలా …టూ ఫాక్టర్ అథంటికేషన్ ను ఆన్ చేస్తే మీ యొక్క అక్కౌంట్స్ ను ఇతర వ్యక్తులు వాడే అవకాశం లేకుండా పోతుంది.
ఎందుకంటే ఈ టూ ఫాక్టర్ అథంటికేషన్ ను ఆన్ చేసిన తర్వాత మీ అకౌంటు నందు లాగిన్ అవడం కోసం ప్రతిసారీ మీ యొక్క మొబైల్ నెంబర్ కు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ ను మీరు ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మీ అకౌంటు ఓపెన్ అవుతుంది. ఇవి కాకుండా మీరు మీ అకౌంటు ను ఉపయోగించని సమయం లో లాగ్ అవుట్ చేసి ఉంచండి.
మీ పాస్ట్ వర్డ్ ను మీ పేరు లేదా మీ మొబైల్ నెంబర్ లేదా ఇతర వ్యక్తిగత వివరాలతో ఉంచకండి. మీ యొక్క అక్కౌంట్స్ కు స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ ను సెట్ చేసుకోవడం వలన చాలా వరకు నేరాలను తగ్గించవచ్చు
** ఎవరైనా ఈ విధంగా మోసపోతే https://cybercrime.gov.in కు మరియు 1930 కు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు విజ్ఞప్తి చేశారు